ఆగస్త్యమునికిచ్చిన వర ప్రభావం వలన శివుడు పార్వతీ దేవితో సహా స్వయంభువుగా ఇక్కడ వెలసాడు. నమ్మికొలచిన భక్తులను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మూడు గృహలను చూడవచ్చు ఒకటి మహాముని ఆగస్త్యుడు తపమాచరించిన గృహ. రెండవది శ్రీ వేంకటేశ్వరస్వామి గృహ. మూడవది శ్రీ విరాట్‌పోతులూరి వీరబ్రహ్మంగారి గృహ. బ్రహ్మం గారు కాలజ్ఞానం కొంత భాగాన్ని ఇక్కడ రచించాడని అంటారు.
స్వామివారి పుష్కరిణి : నంది నోటి నుండి వచ్చే చల్లటి నీటితో ఏర్పడిన అందమైన పుష్కరిణిని ఇక్కడ దర్శించవచ్చు
ఎలా వెళ్లాలి ? : యాగంటి కర్నూలు జిల్లాలోని ఒక పట్టణం. బనగానపల్లి నుండి 14 కి.మీ దూరంలోను, నంద్యాల నుండి 53 కి.మీ దూరంలోను, అహోబిలానికి 70 కి.మీ దూరంలోను కర్నూలుకు 85 కి.మీ దూరంలోను కలదు. దగ్గరలోని రైల్వే స్టేషన్ కర్నూలు.
దైవదర్శన వేళలు : ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు
మరియు సా॥ 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
మ॥ 2.30 ని॥వరకు అన్నదానం హాల్ నందు ఉచిత భోజన సౌకర్యం
వీరభద్రస్వామి ఆలయం : ఈ ఆలయానికి వీరభద్రస్వామి క్షేత్రపాలకుడు. చేతిలో కత్తితో వీరభద్రస్వామి వారి పెద్ద విగ్రహాన్ని దర్శించవచ్చు
.
కాకులు వాని యాగంటి : పూర్వం అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో తపస్సు చేస్తుండగా కాకి రూపంలో ఉన్న కాకాసురుడు అనే రాక్షసుడు అగస్త్యుని తపస్సుకు భంగం కలిగిస్తుండగా కోపించిన ముని యాగంటిలో కాకులు ప్రవేశించకుండా శపించాడట. అప్పటినుండి యాగంటిలో కాకులు తిరగవని అంటారు
ఆకాశదీపం : కొండమీద ఉన్న వీరభద్రస్వామి ఆలయం వెనుక భాగాన ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఆకాశదీపం వెలిగించబడుతుంది. దీనికోసం రెండు మీటర్లు ఉన్న వత్తి మరియు 4 లీటర్ల నూనెను ప్రతి రోజూ పూజారి ఇరుకైన దారిగుండా వెళ్ళి వెలిగిస్తారు. బలమైన గాలులు వీచినా ఆకాశదీపం వెలుగుతూనే ఉంటుంది. భక్తులు ఎవరైనా దీపం కోసం నూనెను మరియు వత్తి ఖర్చు విరాళంగా ఇవ్వవచ్చు.
యాగంటి నందీశ్వరుడు : నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. కలియుగాంతంలో ఈ నందీశ్వరుడు సజీవంగా లేస్తాడని మహాకాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి ఉవాచ.
ఇతర వివరాలకు సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్ : 094403 34003